Social 1080×1350 • Multi-page
10-09-2026 BREAKING NEWS 07:27 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి: పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి: పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు
IMG-20260910-WA0051

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,సెప్టెంబర్ 10: జమ్మికుంటలోని ఇందిరానగర్ చౌక్ వద్ద గల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఇంగిలే రామారావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాం దొరల గడీలను ఎదురించి పోరాడిన ఆమె తెగువ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ పోరాట పటిమ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు అశోక్, గోపాల్, రెడ్డి, సందీప్, అన్వేష్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.