Social 1080×1350 • Multi-page
11-09-2026 BREAKING NEWS 06:48 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ముస్లిం చిన్నారి

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ముస్లిం చిన్నారి
IMG-20260911-WA0033

గణపతి విగ్రహ తయారీ పోటీల్లో ప్రతిభ చాటిన మూడో తరగతి విద్యార్థిని అలీజా

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,సెప్టెంబర్ 11: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీకి చెందిన యాకూబ్ అలీ బాబా, సానియా సుల్తానా దంపతుల కుమార్తె అలీజా తన ప్రతిభతో మత సామరస్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచింది. స్థానిక న్యూ మిలీనియం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఈ చిన్నారి, వినాయక చవితి వేడుకల సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన గణపతి విగ్రహాల తయారీ , ప్రదర్శన పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని సొంతంగా గణనాథుడి ప్రతిమను రూపొందించింది. కులమతాలకు అతీతంగా సమైక్యతా భావాన్ని చాటుతూ అలీజా కనబరిచిన ఈ ఉత్సాహాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విశేషంగా కొనియాడారు. పండుగలు, సంస్కృతులు మనుషులను ఏకం చేస్తాయని, ఈ చిన్నారి మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచిందని పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. లౌకిక భావనతో పోటీల్లో భాగస్వామ్యమైన అలీజాను ప్రిన్సిపాల్‌తో పాటు పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించాయి. చిన్నతనం నుంచే పిల్లల్లో ఇలాంటి సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను ప్రోత్సహించడం సమాజానికి ఎంతో ఆదర్శనీయమని పలువురు కొనియాడారు.