Social 1080×1350 • Multi-page
11-09-2026 BREAKING NEWS 06:59 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

హిమ్మత్ నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

హిమ్మత్ నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
IMG-20260911-WA0041

ఆధునిక వైద్య సేవలు, ఉచిత మందులు పంపిణీ చేసిన ఆదిత్య, అమృత హాస్పిటల్స్

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,సెప్టెంబర్ 11: వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో జమ్మికుంట ఆదిత్య , అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ (జనరల్ మెడిసిన్), డాక్టర్ భరత్ (న్యూరాలజిస్ట్), డాక్టర్ గ్రీష్మ (గైనకాలజిస్ట్) పాల్గొని గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా షుగర్ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ వైద్య శిబిర నిర్వహణకు సహకరించిన గ్రామ సర్పంచ్ జడల శ్రీకాంత్, ఉప సర్పంచ్ మేక శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు , గ్రామ పెద్దలకు ఆదిత్య, అమృత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

రాబోయే రోజుల్లోనూ వివిధ గ్రామాల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తెస్తామని ఆదిత్య , అమృత హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది.