Social 1080×1350 • Multi-page
30-04-2026 BREAKING NEWS 09:00 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పులి వెంకట్

జమ్మికుంట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పులి వెంకట్
IMG-20260430-WA0052

జమ్మికుంట ఏప్రిల్ 30 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పులి వెంకట్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ బదిలీ కావడంతో, ప్రభుత్వం ఆయనను ఈ స్థానంలో నియమించింది. జమ్మికుంట సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకు స్థానిక పోలీస్ సిబ్బంది , ఎస్సైలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సీఐ పులి వెంకట్ మాట్లాడుతూ.. తన పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, ముఖ్యంగా చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి చెప్పుకోవచ్చని, సామాన్యులకు పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.అంతేకాకుండా, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, అనుమానిత వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తూనే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.