Social 1080×1350 • Multi-page
12-09-2026 BREAKING NEWS 08:07 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జిన్నింగ్ మిల్స్ సంఘం నూతన ప్రజాప్రతినిధులకు అడ్తి దారుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

జిన్నింగ్ మిల్స్ సంఘం నూతన ప్రజాప్రతినిధులకు అడ్తి దారుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
IMG-20260912-WA0024

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 12: రాష్ట్ర కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దొణకొండ మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చు భాస్కర్ ను శనివారం జమ్మికుంటలో ఘనంగా సన్మానించారు. స్థానిక అడ్తి దారుల సంక్షేమ సంఘ భవనంలో సంఘ మండలాధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుకు పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. వర్తకులు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు.సన్మాన గ్రహీతలు దొణకొండ మల్లారెడ్డి, బచ్చు భాస్కర్ మాట్లాడుతూ జమ్మికుంట మార్కెట్ యార్డ్ సర్వాంగీణ అభివృద్ధికై తమవంతు శక్తివంచన లేకుండా శ్రమిస్తామని స్పష్టం చేశారు. తమపై ఎంతో అభిమానంతో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అడ్తి దారుల సంక్షేమ సంఘ నాయకులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వ్యాపారులు, అడ్తి దారులు, దాడ్వాయిలు, హమాలీలు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు.