Social 1080×1350 • Multi-page
12-09-2026 BREAKING NEWS 08:19 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్: వార్డు ప్రజల హర్షం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్: వార్డు ప్రజల హర్షం
jpeg-optimizer_1006738020

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 12: జమ్మికుంట పట్టణ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) తన ఎన్నికల హామీని నెరవేర్చుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో, తన చెల్లెలు మొలుగు ప్రణీత విజయం సాధించిన తర్వాత వార్డులో విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు శాశ్వత మండపం నిర్మించాలని స్థానిక ప్రజలు కోరారు. ఆ సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, రాబోయే వినాయక చవితి ఉత్సవాల నాటికి ఆయన ప్రత్యేక చొరవతో విఘ్నేశ్వర మండప నిర్మాణాన్ని పూర్తి చేయించారు.తన మాట ప్రకారం మండప నిర్మాణం పూర్తి చేయించడంతో 24వ వార్డు ప్రజలు మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకత్వానికి వార్డు వాసులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బూరుగుపల్లి రాము, అఖిల్, రాజేష్, సాగర్, వీరస్వామి, పాపయ్య, నాని, తేజ, శ్రీరామ్, సురేష్, పొచాలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.