Social 1080×1350 • Multi-page
14-09-2026 BREAKING NEWS 07:42 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులు: స్వాగతం పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులు: స్వాగతం పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్
FB_IMG_1789394774081

హైదరాబాద్/ఖైరతాబాద్,వి90 న్యూస్, సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతిని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల తన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ మండపం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు సమర్పించి, స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఖైరతాబాద్ మహా గణపతి విశిష్టతను, దశాబ్దాలుగా కొనసాగుతున్న దాని చారిత్రక ప్రాశస్త్యాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గవర్నర్‌కు వివరించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే గణేష్ ఉత్సవాల ప్రత్యేకతలను, స్వామివారి విగ్రహ రూపకల్పనలోని ప్రాముఖ్యతను , భక్తుల సందడికి సంబంధించిన విషయాలను గవర్నర్ దంపతులకు ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.