Social 1080×1350 • Multi-page
15-09-2026 BREAKING NEWS 09:17 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

హనుమకొండలో విషాదం: డివైడర్ చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

హనుమకొండలో విషాదం: డివైడర్ చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
IMG_20260915_211138

హన్మకొండ,వి90 న్యూస్,సెప్టెంబర్ 15: హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక నాయుడు కుండా బిర్యానీ హోటల్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై, డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయాన్నే ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో మృతుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి జేబును తనిఖీ చేయగా ఒక బస్ టికెట్‌తో పాటు సెల్‌ఫోన్ లభ్యమయ్యాయి. లభించిన ఆధారాల ద్వారా మృతుడి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, అతడు హనుమకొండకు ఎందుకు వచ్చాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారు.