Social 1080×1350 • Multi-page
16-09-2026 BREAKING NEWS 03:33 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్
IMG-20260916-WA0017

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 16: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా పాల్గొని, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు , విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని నొక్కి చెప్పారు. “అమ్మ జన్మనిస్తే, చెట్టు పునర్జన్మనిస్తుంది” అని పేర్కొంటూ, ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

విద్యార్థులు తమ తమ నివాస ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తద్వారా సొంత ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్య భద్రతకు దోహదపడిన వారవుతారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్, అధ్యాపకులు ఓదెలు కుమార్, గణేష్, రాజేందర్, రవీందర్లతో పాటు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.