మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి — ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, నాయకులు
కరీంనగర్,వి90 న్యూస్,సెప్టెంబర్ 16: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి దివంగత పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం కరీంనగర్‌లోని తోటలో ఉన్న ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సత్తయ్య సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి, అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సత్తయ్య సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలు , ప్రజా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతామని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు రవాణా , బీసీ సంక్షేమ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్తయ్య కు ఘన నివాళులర్పించారు.

