Social 1080×1350 • Multi-page
16-09-2026 BREAKING NEWS 06:17 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

22ఏ నిషేధిత భూముల సమస్యలపై సమగ్ర విధానం — శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన

22ఏ నిషేధిత భూముల సమస్యలపై సమగ్ర విధానం — శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన
IMG_20260916_181349

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 16: రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా 22ఏ భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన విధివిధానాలను వెల్లడించారు. పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్త నిబంధనలను అమలు చేస్తూ రిజిస్ట్రేషన్, రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ పరిధిలోని భూముల సమస్యల పరిష్కారానికి వారం రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు సింగరేణి ప్రాంత భూములు, కోల్ బెల్ట్ సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే జీవో 118 కింద ఎల్‌బీనగర్‌లోని సుమారు 9,500 మంది బాధితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇళ్ల యాజమాన్య సమస్యలను చట్టపరంగా పరిష్కరిస్తామని, ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల విక్రయానికి అనుమతించేలా నూతన విధానం రూపొందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీటితో పాటు సదాబైనామా, భూదాన్ భూములు, పోడీ, సబ్‌డివిజన్ సమస్యలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రజ ఎదుర్కొంటున్న భూ చిక్కులకు ముగింపు పలికేందుకు లా సెక్రటరీ, రిజిస్ట్రేషన్ కమిషనర్ తదితర అధికారులతో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.