జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 17: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పురప్రజలకు, ప్రజాప్రతినిధులకు , మున్సిపల్ సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, గౌరవ కౌన్సిలర్లు, మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్‌తో పాటు వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

