Social 1080×1350 • Multi-page
17-09-2026 BREAKING NEWS 07:13 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

పేద విద్యార్థి వైద్య విద్యకు ఆసరాగా నిలిచిన హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని

పేద విద్యార్థి వైద్య విద్యకు ఆసరాగా నిలిచిన హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని
IMG-20260917-WA0049

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, సెప్టెంబర్ 17: ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాకూడదనే సత్సంకల్పంతో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు పేద విద్యార్థికి అండగా నిలిచారు. హుస్నాబాద్‌కి చెందిన కొమ్ముల లక్కీ కమల్ అనే విద్యార్థి తీవ్ర పేదరికంలో ఉన్నప్పటికీ, పదో తరగతిలో 9.7 జిపిఏ, ఇంటర్‌మీడియట్‌లో 970 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. ఇటీవల విడుదలైన నీట్ పరీక్షలోనూ అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నాడు. అయితే కుటుంబ పరిస్థితుల రీత్యా వైద్య విద్య కొనసాగించడం భారంగా మారడంతో ఆ విద్యార్థి మాస్ (MASS) సంస్థను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని వెంటనే స్పందించి, మాస్ సంస్థ ద్వారా విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొంటూ ఆమె చేసిన ఈ సాయం పట్ల విద్యార్థి కుటుంబ సభ్యులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.