Social 1080×1350 • Multi-page
17-09-2026 BREAKING NEWS 10:55 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం విజయవాడలో ‘ఆశీర్వాద దీపోత్సవం’: పాల్గొన్న మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యే సుజనా చౌదరి

ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం విజయవాడలో ‘ఆశీర్వాద దీపోత్సవం’: పాల్గొన్న మంత్రి సత్యకుమార్‌, ఎమ్మెల్యే సుజనా చౌదరి
IMG-20260917-WA0072

విజయవాడ,వి90 న్యూస్,సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, ఆయన ప్రజా సేవకు అంకితమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వద్ద ‘ఆశీర్వాద దీపోత్సవం’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరుకాగా, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల అనంతరం నాయకులు దుర్గాఘాట్‌లో కృష్ణానదికి సుందరంగా హారతి ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రజా సేవా ప్రయాణాన్ని కొనియాడుతూ, ఆయనకు కనకదుర్గమ్మ తల్లి ఆయురారోగ్యాలు, నిండైన శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. దేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా తీర్చిదిద్దాలన్న ప్రధాని సంకల్పం నెరవేరడానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. మోదీ పాలన సేవాభావం, సుపరిపాలన, అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్న మంత్రి, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, జనధన్, పీఎం కిసాన్ వంటి పథకాలతో పాటు డిబిటి విధానం ద్వారా కోట్లాది మంది లబ్ధిదారులకు పారదర్శకంగా సంక్షేమం అందుతోందని వివరించారు.అలాగే ముద్ర, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతలో స్వయం ఉపాధిని పెంపొందిస్తున్నాయని, దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంతో స్థానిక రవాణా కష్టాలు తీరాయని మంత్రి తెలిపారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్, వివిధ జాతీయ సంస్థల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ప్రధాని పుట్టినరోజును కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా రక్తదాన, వైద్య శిబిరాలు, ‘సేవా సేతు’ వంటి సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని చెబుతూ, నెల రోజుల పాటు జరిగే ‘సేవా సంకల్ప్‌ అభియాన్’లో ప్రజలు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.