Social 1080×1350 • Multi-page
18-09-2026 BREAKING NEWS 05:44 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

నాయిని చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం

నాయిని చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం
IMG-20260918-WA0013

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్ సెప్టెంబర్ 18: జమ్మికుంట పట్టణంలో జరగనున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నాయిని చెరువు వద్ద చేపడుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌస్ అలాం స్వయంగా పరిశీలించారు. విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సురక్షితంగా , వేగవంతంగా పూర్తి చేసేందుకు మూడు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్‌ఐలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నాయిని చెరువు వద్ద అవసరమైన పారిశుద్ధ్య చర్యలు, విద్యుత్ సౌకర్యం, నిరంతర తాగునీటి సరఫరా, మెరుగైన లైటింగ్ , ఇతర మౌలిక వసతులను సమర్థవంతంగా సమకూరుస్తున్నట్లు అధికారులు వివరించారు. భక్తులు , మండప నిర్వాహకులు ప్రభుత్వం, పోలీసు శాఖ జారీ చేసే మార్గదర్శకాలను తప్పక పాటించాలని, భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సీపీ పిలుపునిచ్చారు.