ప్రతి పదం ప్రజా హితం
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్
ములుగు,వి90 న్యూస్,సెప్టెంబర్ 19: ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో తహసీల్దార్ సృజన్ కుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక రైతుకు చెందిన భూమిని ఆయన ఏకైక కుమార్తె పేరిట మార్చేందుకు గాను తహసీల్దార్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై సదరు బాధితురాలు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వ్యూహాత్మకంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కార్యాలయంలోనే రూ.14 వేల లంచం సొమ్ము తీసుకుంటుండగా సృజన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకుని, లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.

