ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ నియామకం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 20: ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా జమ్మికుంటకు చెందిన మారపల్లి రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం అందించడం మరియు సమాచార హక్కు చట్టం (RTI) పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన జాతీయ చైర్మన్ అఖిలేష్ రెడ్డి, తెలంగాణ అధ్యక్షులు బతుల శంకర్, రాష్ట్ర ఇంచార్జ్ కొంగంటి రాజ్ కుమార్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని రాజేష్ ఆకాంక్షించారు. కాగా, ఆయన నియామకంపై సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాజేష్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో మానవ హక్కుల రక్షణ , సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.

