ప్రతి పదం ప్రజా హితం
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: వోల్వో కారులో చెలరేగిన మంటలు, ఖమ్మం న్యూరో సర్జన్ సజీవ దహనం
సూర్యాపేట,వి90 న్యూస్,సెప్టెంబర్ 20: సూర్యాపేట పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఖమ్మం-హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక వోల్వో కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో చిక్కుకున్న వ్యక్తి బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పరిసర ప్రాంతాలకు చేరుకుని మృతదేహ ఆనవాళ్లను గుర్తించారు. మృతుడు ఖమ్మం మమత ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్‌గా నిర్ధారించారు. ఈ ప్రమాదం ఉదయం 7:15 గంటల ప్రాంతంలో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తుండగా, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

