Social 1080×1350 • Multi-page
21-09-2026 BREAKING NEWS 08:10 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

దివంగత ఉద్యమకారులు లింగాల కేదారి దంపతుల కుటుంబానికి రూ. 10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

దివంగత ఉద్యమకారులు లింగాల కేదారి దంపతుల కుటుంబానికి రూ. 10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
FB_IMG_1790001399242

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 21: తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన కేదారి దంపతులు ఇటీవల విషాదకర సంఘటనలో మృతి చెందగా, సీఎం ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి సీఎం ఓఎస్డీ రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. మంజూరైన ఈ మొత్తాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులకు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.ఉద్యమ సమయంలో కేదారి దంపతులు అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒక సాధారణ హోటల్ నడుపుతూనే, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దాన్ని వృథా చేయకూడదనే సామాజిక బాధ్యతతో మెలిగిన వీరు, ఉద్యమ రోజుల్లో పోరాటయోధులకు ఉచితంగా భోజనాలు, టిఫిన్లు, టీలు అందించి తమ నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.