నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను విద్యార్థుల హాస్టల్‌గా మార్చాలి: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 22: జమ్మికుంటలోని పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మంగళవారం సందర్శించారు. భవనం చెక్కుచెదరకుండా, పూర్తి సురక్షితంగా ఉన్నప్పటికీ దానిని మూసివేసి ఉంచడం సరికాదని ఆయన విమర్శించారు. దశాబ్దాలుగా సరైన హాస్టల్ వసతులు లేక సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఈ పాత కళాశాల భవనాన్ని వెంటనే విద్యార్థుల హాస్టల్‌గా మార్చి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ వసతులు కల్పించకపోతే విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ SFD కో-కన్వీనర్ గోస్కుల అజయ్, జమ్మికుంట నగర కార్యదర్శి భోగం శశాంక్, నాయకులు రోహిత్, ఆఫ్రిద్, మోయిస్, సల్మాన్, రిషికేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

