Social 1080×1350 • Multi-page
23-09-2026 BREAKING NEWS 11:55 AM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

మాదకద్రవ్యాల నియంత్రణలో ‘ఈగల్ ఫోర్స్’కు జాతీయ గుర్తింపు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు

మాదకద్రవ్యాల నియంత్రణలో ‘ఈగల్ ఫోర్స్’కు జాతీయ గుర్తింపు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు
FB_IMG_1790144498008

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 23: మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) 3వ జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ అవార్డును అందుకోవడం రాష్ట్ర పోలీసు శాఖకు, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈ జాతీయ గుర్తింపు నిదర్శనమని, ఇది అధికారుల్లో మరింత ప్రోత్సాహాన్ని నింపుతుందని వ్యాఖ్యానించారు.డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం కేవలం పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, యువతను ఈ బారిన పడకుండా కాపాడటం ప్రతి కుటుంబం, పాఠశాల, సంస్థ , పౌరుడి సమిష్టి బాధ్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని పేర్కొంటూ.. డ్రగ్స్ ప్రభావం నుంచి వారిని రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా సహకరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి సంబంధించి ఏ చిన్న సమాచారం ఉన్నా ప్రజలు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.’నషా ముక్త భారత్’ లక్ష్య సాధనలో తెలంగాణ నుంచి బలమైన అడుగు పడాలని, 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే దిశగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు. మాదకద్రవ్యాలపై పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తూ, యువతను చైతన్యపరచడం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.