జమ్మికుంట నాయిని చెరువు వద్ద తొలి గణేష్ విగ్రహ నిమజ్జనం ప్రారంభం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 23: జమ్మికుంట పట్టణంలో నవరాత్రుల పాటు నిత్య పూజలందుకున్న విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాల నిమజ్జన ఘట్టం వైభవంగా ప్రారంభమైంది. స్థానిక నాయిని చెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మొదటి గణేష్ విగ్రహ నిమజ్జనాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో నిమజ్జన కార్యక్రమాలు మొదలైనందున, ఉత్సవ నిర్వాహకులు సకాలంలో చెరువు వద్దకు చేరుకుని భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, ఆర్‌డీఓ, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, ఎమ్మార్వో, సీఐ, ఎస్సైలతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

