Social 1080×1350 • Multi-page
23-09-2026 BREAKING NEWS 09:22 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

పొలంలో పనులు చేస్తుండగా విరుచుకుపడ్డ పిడుగు.. మహిళ అక్కడికక్కడే మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

పొలంలో పనులు చేస్తుండగా విరుచుకుపడ్డ పిడుగు.. మహిళ అక్కడికక్కడే మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
IMG-20260923-WA0052

వనపర్తి,వి90 న్యూస్,సెప్టెంబర్ 23: పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనులు చేసుకుంటున్న మహిళలపై ఒక్కసారిగా పిడుగు పడటంతో కుమ్మరి లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనురాధ, సువర్ణలను స్థానికులు వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో సూగూరు గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.