Social 1080×1350 • Multi-page
26-09-2026 BREAKING NEWS 03:24 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
IMG-20260926-WA0020

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 26: జమ్మికుంట పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ వేడుకలను పురస్కరించుకుని చైర్మన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి తమ తరఫున, రజక సంఘ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ, ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్‌ఐ భాస్కర్, ఏఈ వికాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, వార్డు ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే రజక సంఘం అధ్యక్షులు వరంగంటి సదానందం, బూరుగుపల్లి రాము, గంగారపు శ్రీకాంత్, రజక సంఘం నాయకులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు , స్థానికులు పాల్గొన్నారు.