Social 1080×1350 • Multi-page
27-09-2026 BREAKING NEWS 09:18 AM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

అంగన్‌వాడీల నుంచే ‘ఈఎంఐ’ లంచాలు.. ఏసీబీకి దొరికిపోయిన సీడీపీఓ పద్మ!

అంగన్‌వాడీల నుంచే ‘ఈఎంఐ’ లంచాలు.. ఏసీబీకి దొరికిపోయిన సీడీపీఓ పద్మ!
IMG_20260927_091542

జగిత్యాల,వి90 న్యూస్,సెప్టెంబర్ 27: మెట్‌పల్లి పరిధిలో సంచలనం సృష్టించే లంచం ఉదంతం వెలుగుచూసింది. అంగన్‌వాడీ కేంద్రాలపై ఎలాంటి నెగెటివ్ నివేదికలు ఇవ్వకుండా ఉండేందుకు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) దారోజు పద్మ ఏకంగా నెలవారీ ‘ఈఎంఐ’ పద్ధతిలో లంచాలు వసూలు చేస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు కంటికి రెప్పపాటులో దొరికిపోయారు. తన పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నెలకు కేంద్రానికి వెయ్యి రూపాయల చొప్పున, గడిచిన మూడు నెలలకు గానూ రూ.63,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రంగులచేత్తో పట్టుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ క్రమం తప్పకుండా వసూళ్లకు పాల్పడుతున్న సదరు అధికారిణి లీలలు బయటపడటంతో జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా ఉంచిన ఏసీబీ బృందం పక్కా వ్యూహంతో దాడి చేసి సీడీపీఓ పద్మను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేసింది.