Social 1080×1350 • Multi-page
27-09-2026 BREAKING NEWS 06:55 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

అనారోగ్యంతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

అనారోగ్యంతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
1006908486-200kb

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్ సెప్టెంబర్ 27: మోత్కులగూడెం గ్రామంలో గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బలబద్ర రామారావు (60) అనే వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బతుకుతెరువు కోసం నాలుగు సంవత్సరాల కిందట ఇక్కడకు వచ్చి స్థిరపడిన ఆయన, బి.పి, షుగర్ వంటి వ్యాధుల తీవ్రతతో తరచూ జీవితంపై విరక్తి వ్యక్తం చేసేవాడు. ఇటీవల కూతురి ప్రసవం నిమిత్తం భార్య శివమ్మ నరసరావుపేట వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రామారావు, ఒకరోజు ముందు బాత్‌రూంలో కిందపడిపోగా స్థానికులు గమనించి ఆయన భార్యకు సమాచారం అందించారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి మంచంపై గొంతు కోసుకొని రక్తమడుగులో పడివుండటంతో, స్థానికుడు పొన్నగంటి రాము సహాయంతో వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు.