Social 1080×1350 • Multi-page
28-09-2026 BREAKING NEWS 07:23 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ
IMG-20260928-WA0046

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్ సెప్టెంబర్ 28: జమ్మికుంట పట్టణ పరిధిలో ఇటీవల మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న ఐదుగురు బాధితులకు జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ వాటిని తిరిగి అందజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసిన ఐదు ఫోన్లను రికవరీ చేసి, ఈరోజు పోలీసు స్టేషన్‌లో యజమానులకు అప్పగించారు.ఈ ఆపరేషన్‌లో సీఈఐఆర్ ఆపరేటర్ కానిస్టేబుల్ సౌమ్య కీలక పాత్ర పోషించి సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను ట్రేస్ చేశారని సీఐ రామకృష్ణ తెలిపారు. ఫోన్లను తిరిగి పొందిన కొమ్ము ప్రేమ్ కుమార్, ఎండి రియాజుద్దీన్, గాదె రాములు, ఎండి సాదిక్, యాద వెంకటాచలం పోలీసులు సకాలంలో స్పందించి తమ ఫోన్లను అప్పగించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.