Social 1080×1350 • Multi-page
29-09-2026 BREAKING NEWS 12:37 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ట్రాఫిక్ చలాన్ల రికవరీకి కఠిన చర్యలు: పెండింగ్ బాకీలను కరెంట్ బిల్లులతో అనుసంధానించాలని సుప్రీంకోర్టు సంచలన సూచన

ట్రాఫిక్ చలాన్ల రికవరీకి కఠిన చర్యలు: పెండింగ్ బాకీలను కరెంట్ బిల్లులతో అనుసంధానించాలని సుప్రీంకోర్టు సంచలన సూచన
FB_IMG_1790665351092

డిల్లీ,వి90 న్యూస్,సెప్టెంబర్ 29: దేశవ్యాప్తంగా పేరుకుపోయిన బారీ ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వసూలుపై అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదనలు చేసింది. కేవలం ఈ-చలాన్లు జారీ చేసి ఊరుకోవడం సరికాదని, బకాయిల వసూళ్లకు అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వినియోగదారుల కరెంట్ బిల్లులతో అనుసంధానించే వినూత్న అంశాన్ని పరిశీలించాలని సూచించింది.ప్రస్తుతం దేశంలో సుమారు రూ.45 వేల కోట్ల విలువైన చలాన్లు బకాయిలు ఉండగా, వాటిలో కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఈ భారీ వ్యత్యాసాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, వసూళ్లను వేగవంతం చేసేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించింది. చలాన్లు చెల్లించని వాహనదారులకు సంబంధించి వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, పియుసి సర్టిఫికెట్లు, వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీపై ఆంక్షలు విధించడంతో పాటు, అవసరమైతే వాహనాలను జప్తు చేసేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని అభిప్రాయపడింది.