ప్రతి పదం ప్రజా హితం
జమ్మికుంటలో బాధితులకు పరామర్శ, నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ (దిలీప్)
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 29: జమ్మికుంట పట్టణంలో శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) విస్తృతంగా పర్యటించి పలు సంక్షేమ, పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన నిరుపేద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న మాజీ కౌన్సిలర్ గాజుల భాస్కర్ తండ్రిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల వివిధ కారణాలతో మృతిచెందిన పలువురి కుటుంబ సభ్యులను నేరుగా కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు , నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

