పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణే మున్సిపాలిటీ ధ్యేయం: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 29: జమ్మికుంట పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక వైద్య పరీక్షల కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపైనే వారి కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రమేష్, వావిలాల పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ మొలుగు చందనతో పాటు పలువురు మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

