Social 1080×1350 • Multi-page
30-09-2026 BREAKING NEWS 07:23 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

మహాజన సోషలిస్టు పార్టీ జమ్మికుంట మండల మహిళా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మహాజన సోషలిస్టు పార్టీ జమ్మికుంట మండల మహిళా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
IMG-20260930-WA0029

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 30: జమ్మికుంట మండలంలో మహాజన సోషలిస్టు పార్టీ (ఎమ్‌ఎస్‌పీ) మహిళా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, మండల ఇన్చార్జి తునికి వసంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలు, సూచనల మేరకు నూతన కమిటీని ప్రకటించారు.మండల అధ్యక్షురాలుగా చిలుమల మనోహర, ఉపాధ్యక్షురాళ్లుగా మైస రజిత, గుల్లి విమల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా అల్లూరి మౌనిక, గుల్లి తిరుమల, గుల్లి ప్రియాంక, మైసా చిలకమ్మ, రాగుల ఓదమ్మ, గాజుల లక్ష్మి, బుర్ర రాజేశ్వరి నియామకమయ్యారు.ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు రుద్రావరపు రామచంద్రం మాదిగ, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ, మహిళా విభాగం కన్వీనర్ బొద్దుల వాణి, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ బొద్దుల దివ్య, తునికి వసంత విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన, ఆత్మగౌరవం, సమానత్వం కోసం కమిటీలు పోరాడాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఆయనకు రుణపడి ఉంటామని నూతన నాయకులు తెలిపారు.అలాగే, అక్టోబర్ 2, 2026న కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న మద్యపాన నిషేధ ధర్నాను అందరూ కలిసికట్టుగా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.