Social 1080×1350 • Multi-page
02-10-2026 BREAKING NEWS 12:14 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

గాంధీజీ ఆశయాలు ప్రగతికి దిక్సూచి: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్

గాంధీజీ ఆశయాలు ప్రగతికి దిక్సూచి: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్
FB_IMG_1790923265180

హైదరాబాద్,వి90న్యూస్,అక్టోబర్ 02: సైబరాబాద్ కమిషనరేట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం సీపీ ప్రసంగిస్తూ, మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, క్రమశిక్షణ మార్గాలు నేటి కాలంలోనూ ప్రతి ఒక్కరికీ నిత్య ఆదర్శప్రాయాలని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, నడిపిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని గుర్తుచేశారు. గాంధీజీ ఆశయాల నుంచి స్ఫూర్తి పొంది సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు తక్షణ న్యాయం అందించడం, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం, సమాజ సేవకు అంకితభావంతో పనిచేయడమే పోలీసుల ప్రాథమిక కర్తవ్యమని సీపీ తేల్చిచెప్పారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, శాంతియుతమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్, హన్మంత్ రావులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది విశేషంగా పాల్గొన్నారు.