Social 1080×1350 • Multi-page
02-10-2026 BREAKING NEWS 06:38 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఆర్టీసీ బస్సులు నిలపాలని శాలపల్లి ఇందిరానగర్ వాసుల రాస్తారోకో

ఆర్టీసీ బస్సులు నిలపాలని శాలపల్లి ఇందిరానగర్ వాసుల రాస్తారోకో
IMG_20261002_181844

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, అక్టోబర్ 02: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదంటూ గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆందోళనకు దిగారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట హుజురాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ ప్రధాన రహదారిపై నిత్యం వందలాది ఆర్టీసీ బస్సులు వెళ్తున్నప్పటికీ, తమ గ్రామంలో మాత్రం నిలపకపోవడంతో ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా నిత్యం ఉద్యోగాలు, కూలి పనులకు వెళ్లే కార్మికులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.గ్రామంలో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో “వీ వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసనకు దిగారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో బస్సు స్టాప్ సౌకర్యం కల్పించి, బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్, ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులతో పాటు వందలాది మంది గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.