Social 1080×1350 • Multi-page
02-10-2026 BREAKING NEWS 07:13 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్
IMG-20261002-WA0086

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 02: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) , స్థానిక కౌన్సిలర్లతో కలిసి కేంద్ర మంత్రితో పాటు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ రూపురేఖలను మార్చేలా పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా ఎంపీ నిధులను కేటాయించాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కోరారు. పట్టణాభివృద్ధిపై చైర్మన్ చేసిన విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన నిధుల కేటాయింపునకు హామీ ఇచ్చారు. ఈ వేడుకలలో పలువురు వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.