మహాత్మా గాంధీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,అక్టోబర్ 02: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో గాంధీ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) స్థానిక గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… అహింస, శాంతియుత మార్గంలో పోరాటం చేస్తూ మన హక్కులను ఎలా సాధించుకోవాలో ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ, ఆయన ఆశయాల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు, మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి, ఆర్‌ఐ భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, వార్డు ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది, పలువురు రాజకీయ నాయకులు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

