Social 1080×1350 • Multi-page
02-10-2026 BREAKING NEWS 07:28 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

బాపూ ఘాట్‌లో గాంధీజీకి ఘన నివాళి: గవర్నర్, సీఎం చేతుల మీదుగా డిజిటల్ మ్యూజియం ప్రారంభం

బాపూ ఘాట్‌లో గాంధీజీకి ఘన నివాళి: గవర్నర్, సీఎం చేతుల మీదుగా డిజిటల్ మ్యూజియం ప్రారంభం
FB_IMG_1790949172198

హైదరాబాద్,వి90న్యూస్,అక్టోబర్ 02: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాపూ ఘాట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్, ముఖ్యమంత్రి కలసి లాంఛనంగా ప్రారంభించారు. గాంధీజీ జీవిత విశేషాలు, ఆయన పోరాట పటిమను నేటి తరానికి అందించేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.

అలాగే ప్రభుత్వ సలహాదారులు వీ హనుమంత రావు, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితర ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.