Social 1080×1350 • Multi-page
06-10-2026 BREAKING NEWS 05:55 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్: ఒడితల ప్రణవ్

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్: ఒడితల ప్రణవ్
IMG-20261006-WA0002

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, అక్టోబర్ 06: హుజురాబాద్‌లోని ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికే తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఒడితల ప్రణవ్ స్పష్టం చేశారు. ఐక్య కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 9న జరిగే ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ కార్మికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, వారి సంక్షేమం గురించి ఆనాటి ప్రభుత్వం ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని కొనియాడారు. కార్మికులకు అందాల్సిన ఫలాలను అందిస్తూ, ప్రభుత్వానికి కార్మికులకు మధ్య మంత్రి వారధిగా నిలుస్తున్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పరిష్కారం కాని సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చి చూపిందని, విలీనం అంశం కూడా ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉందని వివరించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇస్తూ, ఈ ఎన్నికల్లో ఐక్య కూటమికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, ఐక్య కూటమి నాయకులు , పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.