ఓటు చోరీపై కలెక్టరేట్ ముట్టడి: బీజేపీ వైఖరిపై విరుచుకుపడ్డ వొడితల ప్రణవ్
కరీంనగర్,వి90 న్యూస్,అక్టోబర్ 06: ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం దొంగదారిలో కాలరాస్తోందని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో కరీంనగర్ ఇందిరా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రజల్లో ఆదరణ కరువవ్వడంతోనే బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆయన విమర్శించారు. తక్షణమే సీఈసీ జ్ఞానేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, ఇండియా కూటమి, వామపక్షాల భాగస్వామ్య నాయకులు , మహిళా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

