Social 1080×1350 • Multi-page
06-10-2026 BREAKING NEWS 07:23 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

కష్టాల్లో ఉన్న పేదలకు అండగా వొడితల ప్రణవ్: రూ. 1.75 లక్షల ఎల్ఓసి అందజేత

కష్టాల్లో ఉన్న పేదలకు అండగా వొడితల ప్రణవ్: రూ. 1.75 లక్షల ఎల్ఓసి అందజేత
IMG-20261006-WA0059

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్, అక్టోబర్ 06: కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయాన్ని అందజేస్తూ, పేదలకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ అండగా నిలుస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే తెలుసుకుని, ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారి సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన మచ్చర్ల మొగిలి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. బాధితుని వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 1,75,000 విలువైన ఎల్ఓసి (LOC) మంజూరు చేయించి అందజేశారు. ఆపద సమయంలో తమను ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు , ఇన్ చార్జి వొడితల ప్రణవ్ కు బాధితులు, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.