Social 1080×1350 • Multi-page
08-10-2026 BREAKING NEWS 07:30 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

పాత డిగ్రీ కళాశాల బిల్డింగ్‌ను వెంటనే వినియోగంలోకి తేలి: BRSV జమ్మికుంట పట్టణ శాఖ డిమాండ్

పాత డిగ్రీ కళాశాల బిల్డింగ్‌ను వెంటనే వినియోగంలోకి తేలి: BRSV జమ్మికుంట పట్టణ శాఖ డిమాండ్
IMG-20261008-WA0024

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 08: జమ్మికుంట పట్టణంలో BRSV ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి (MEO), తహశీల్దార్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BRSV జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొమ్ము నరేష్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంలోని పాత డిగ్రీ కళాశాల భవనాన్ని ఖాళీగా ఉంచకుండా వెంటనే స్టడీ సర్కిల్‌గా మార్చాలని, లేదా పట్టణ , రూరల్ పరిధిలోని గురుకుల విద్యాలయాలకు, ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యార్థుల హాస్టల్‌గా కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పట్టణ , రూరల్ పరిధిలోని గురుకులాలు ప్రైవేట్ భవనాలలో కొనసాగుతూ నెలకూ రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నప్పటికీ, ఆ భవనాల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని విమర్శించారు.

BRSV బృందం ఆ భవనాలను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైందని, మౌలిక వసతులు లేని ప్రైవేట్ బిల్డింగులకు లక్షలాది రూపాయల అద్దెలు చెల్లించే బదులు గత ఆరు, ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భవనంలోకి గురుకులాలను లేదా హాస్టళ్లను తక్షణమే షిఫ్ట్ చేయాలని కోరారు. అరకొర వసతులున్న ప్రైవేట్ భవనాల్లో విద్యార్థులకు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా జమ్మికుంట ZPHS బాలుర హైస్కూల్‌లోని పాత భవనం పూర్తిగా కూలిపోయే స్థితికి చేరుకుందని, అందులో పిచ్చి మొక్కలు పెరిగి పాములు, దోమలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పాఠశాల విద్యార్థులతో పాటు చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే ఆ పాత భవనాన్ని కూల్చివేసి, ఆ స్థలంలో ZPHS బాలుర హాస్టల్ భవనాన్ని నిర్మించాలని కోరారు. ప్రస్తుతం హాస్టల్ లేక బయట వేలాది రూపాయలు అద్దె చెల్లించి ప్రైవేట్ భవనాల్లో విద్యార్థులను ఉంచుతున్నారని, ఈ రెండు ప్రధాన సమస్యలపై MEO, తహశీల్దార్ తక్షణమే స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో BRSV నాయకులు జీవాజీ అనిల్, పాతకాల అజయ్, బండారి ప్రశాంత్, ఎండి అబ్రార్, రాజు, మహేష్, కౌశిక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.