Social 1080×1350 • Multi-page
13-10-2026 BREAKING NEWS 10:31 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల భారీ రద్దీ.. బోనాలతో మొక్కుల చెల్లింపు

వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల భారీ రద్దీ.. బోనాలతో మొక్కుల చెల్లింపు
FB_IMG_1791910495970

రాజన్న సిరిసిల్ల/వేములవాడ/వి90 న్యూస్/అక్టోబర్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులతో పోటెత్తింది. మంగళవారం పర్వదినం కావడం, దసరా , బతుకమ్మ శరన్నవరాత్రి పండుగ సెలవులు ఏకకాలంలో ప్రారంభం కావడంతో చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు బారులు తీరి పవిత్రతతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేపట్టారు. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం, శాకపట్నాలు నైవేద్యంగా సమర్పించి తమ మొక్కుబడులను భక్తిభావంతో చెల్లించుకున్నారు.

భక్తుల తాకిడి భారీగా పెరిగినప్పటికీ, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు , సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల నిర్వహణతో పాటు త్వరితగతిన దర్శనం లభించేలా చర్యలు తీసుకోవడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలిపారు.