Social 1080×1350 • Multi-page
25-11-2026 BREAKING NEWS 07:33 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం : కోడం రజిత

సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం : కోడం రజిత
IMG-20261125-WA0017

కరీంనగర్/ఇల్లందకుంట/వి90 న్యూస్/నవంబర్ 25: ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కోడం రజిత ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.

పేద ప్రజలకు గృహ హక్కు కల్పించాలనే మహోన్నత ఆలోచనతో ప్రారంభమైన గొప్ప సంకల్పం ఇందిరమ్మ ఇళ్ల పథకమని ఆమె కొనియాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సహకారంతో పాతర్లపల్లి గ్రామానికి 24 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. తమ సొంత ఇంటి కల సాకారమవుతుండటంతో గ్రామ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని, వారంతా కాంగ్రెస్ పార్టీకి, ప్రజా ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారని కోడం రజిత వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బైరెడ్డి కొండల్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోడం శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.