Social 1080×1350 • Multi-page
25-11-2026 BREAKING NEWS 07:42 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

రైల్వే అభివృద్ధిలో కరీంనగర్ పార్లమెంట్ ముందంజ.. బండి సంజయ్ కు కృతజ్ఞతలు : ఆకుల రాజేందర్

రైల్వే అభివృద్ధిలో కరీంనగర్ పార్లమెంట్ ముందంజ.. బండి సంజయ్ కు కృతజ్ఞతలు : ఆకుల రాజేందర్
IMG-20261125-WA0021

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 25: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రత్యేక కృషితో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే, రహదారి రంగాలలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ కొనియాడారు.

కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు అన్ని మండలాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. వరంగల్ – జగిత్యాల జాతీయ రహదారి పనులతో పాటు, ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు, నూతన రైళ్ల నిలుపుదల వంటి ఆధునీకరణ పనులు చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు.

అంతేకాకుండా స్థానిక వ్యాపారుల ఎగుమతులు, దిగుమతుల సౌకర్యార్థం జమ్మికుంట, ఉప్పల్ స్టేషన్లలో ప్రత్యేకంగా గూడ్స్ వ్యాగన్ సెంటర్ల ఏర్పాటుకు బండి సంజయ్ కృషి చేస్తున్నారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొండగట్టులో నూతన రైల్వే స్టేషన్ ఏర్పాటుకు అనుమతులు కోరుతూ, ఆంజనేయ స్వామి కృపకు పాత్రులవుతూ నియోజకవర్గ అభివృద్ధిలో ముందున్న ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ఆకుల రాజేందర్ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.