Social 1080×1350 • Multi-page
10-05-2026 BREAKING NEWS 08:31 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

కోరపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం: నూతన అధ్యక్షుడిగా పింగిలి రమేష్

కోరపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం: నూతన అధ్యక్షుడిగా పింగిలి రమేష్
100549415

జమ్మికుంట, వి90 న్యూస్, మే 10: జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం అత్యంత సామరస్యపూర్వక వాతావరణంలో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో, గ్రామస్థులు, సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మానంతో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షునిగా పింగిలి రమేష్ (స్వామి కుమారుడు), ఉపాధ్యక్షునిగా టంగుటూరి రామ్మోహన్ , సెక్రటరీగా మద్దెర్ల రమేష్ బాధ్యతలు చేపట్టారు.వీరితో పాటు డైరెక్టర్లుగా కొండవేనా పోషాలు, టంగుటూరి సంజీవ్, పింగిలి సంపత్, టంగుటూరి ఉమేష్, తీగల మల్లేష్, టంగుటూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇరు కులాల సభ్యుల సమక్షంలో అందరూ సమ్మతించడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ అరుణ జ్యోతి ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి గ్రామ పెద్దలు, మత్స్యకార సంఘ సభ్యులు మరియు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.