Social 1080×1350 • Multi-page
15-05-2026 BREAKING NEWS 07:34 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ప్రధాని పిలుపుతో సైకిల్‌పై వార్డు పర్యటన: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆదర్శం

ప్రధాని పిలుపుతో సైకిల్‌పై వార్డు పర్యటన: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆదర్శం
1005529135

జమ్మికుంట, వి90 న్యూస్ ,మే 15: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) వినూత్నంగా స్పందించారు. అనవసరంగా వాహనాలను వాడకుండా పర్యావరణ హితంగా ఉండాలన్న ప్రధాని సూచన మేరకు, ఆయన శుక్రవారం పట్టణంలోని 15వ వార్డులో సైకిల్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న శానిటేషన్ , పరిశుద్ధ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో పారిశుధ్య పనులు ఒక జట్టుగా (టీమ్ వర్క్) సమన్వయంతో సాగుతున్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. నిన్న ప్రధాని మోదీ అత్యవసరమైతే తప్ప మోటార్ బైక్ లేదా ఇతర వాహనాలను వాడవద్దని ఇచ్చిన పిలుపుతో, తాను సైకిల్ పై వార్డు సందర్శనకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, స్థానిక కౌన్సిలర్ పాతకాల మౌనిక అనిల్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం, ఏఈ వికాస్ , ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.