Social 1080×1350 • Multi-page
15-05-2026 BREAKING NEWS 08:18 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య: ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య: ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
IMG-20260515-WA0047

పెద్దపల్లి,వి90 న్యూస్, మే 15: పెద్దపల్లి – రాఘవాపురం రైల్వే స్టేషన్ల మధ్య విషాద ఘటన చోటుచేసుకుంది. మంథని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో సుమారు 50 నుండి 55 ఏళ్ల వయస్సు కలిగిన ఒక గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నలుపు రంగు ప్యాంట్, తెలుపు రంగు షర్ట్ ధరించి ఉన్నాడని, లోపల లైట్ బ్లూ రంగు షర్ట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మల్టీ కలర్ డిజైన్ కలిగిన హాఫ్ ప్యాంట్, పింక్, బ్లూ మరియు పసుపు రంగుల డిజైన్ ఉన్న టాప్ ధరించి ఉన్నాడు. మృతుడు ధరించిన షర్ట్‌పై ‘VMR Durga Tailors, Shanthi Nagar- BCM’ అనే లేబల్ ఉంది.మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. ప్రస్తుతం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు 9949304574 లేదా 8712658604 ఫోన్ నంబర్లకు సంప్రదించి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.