Social 1080×1350 • Multi-page
29-05-2026 BREAKING NEWS 07:53 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

బిజీగిర్ షరీఫ్ దర్గాలో చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

బిజీగిర్ షరీఫ్ దర్గాలో చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20260529-WA0045

కరీంనగర్/జమ్మికుంట, వి90 న్యూస్, మే 29: జమ్మికుంట మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బిజీగిర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం రోజున హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి దర్గాను సందర్శించారు.

ఈ సందర్భంగా దర్గాలోని పవిత్ర సమాధులకు ఆయన నియోజకవర్గ ప్రజల తరపున భక్తిశ్రద్ధలతో చాదర్లు సమర్పించారు. అనంతరం మత గురువు మౌలానా యాసీన్ ఎమ్మెల్యే సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య, గండ్రపల్లి సర్పంచ్ తోట కవిత-లక్ష్మణ్, బిఆర్ఎస్ నాయకులు పిట్టల రమేష్, పొనగంటి సంపత్, పొనగంటి రాము, చీలుమల్ల రామస్వామి పాల్గొన్నారు. మండల మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సమీర్, మహమ్మద్ రఫీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వహణ అధ్యక్షుడు మొహమ్మద్ తోఫిక్ హుస్సేన్, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయీముద్దీన్, కమిటీ సభ్యులు సర్వర్, షా హుస్సేన్, మొహమ్మద్ ఇర్ఫాన్ హుస్సేన్, మహమ్మద్ ఇమ్రాన్ హుసేన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.