Social 1080×1350 • Multi-page
29-05-2026 BREAKING NEWS 08:03 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఎస్ఐఆర్(SIR) విధానంపై గ్రామ గ్రామాన విస్తృత అవగాహన కల్పిస్తాం: కూన శ్రీశైలం గౌడ్, వొడితల ప్రణవ్

ఎస్ఐఆర్(SIR) విధానంపై గ్రామ గ్రామాన విస్తృత అవగాహన కల్పిస్తాం: కూన శ్రీశైలం గౌడ్, వొడితల ప్రణవ్
IMG-20260529-WA0052

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,మే 29: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్(SIR) విధానంపై వాడవాడలా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ముందుకు సాగాలని, ఇందుకు పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎంతో అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీగా కృషి చేయాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్ఐఆర్ సమన్వయకర్త, కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కూన శ్రీశైలం గౌడ్, వొడితల ప్రణవ్ పార్టీ శ్రేణులకు, నాయకులకు ఎస్ఐఆర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఉందని, ఆ ఆధిపత్యాన్ని ఇలాగే కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న చర్యలను తిప్పికొడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల ఓటు హక్కును కాపాడాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ నాయకులు ఎస్ఐఆర్ విధానంపై విసృతంగా ప్రచారం నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంధె సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, స్థానిక కౌన్సిలర్లు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ దేవస్థానాల చైర్మన్లు, డైరెక్టర్లు, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, అధ్యక్షురాళ్లు, బ్లాక్ కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, మైనారిటీ, సేవాదళ్ విభాగాల ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.