Social 1080×1350 • Multi-page
29-05-2026 BREAKING NEWS 08:44 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

విజయవాడ బీజేపీ కార్యాలయంలో ‘జనతా వారధి’.. ప్రజా సమస్యల స్వీకరణ

విజయవాడ బీజేపీ కార్యాలయంలో ‘జనతా వారధి’.. ప్రజా సమస్యల స్వీకరణ
IMG-20260529-WA0072

విజయవాడ,వి90 న్యూస్,మే 29: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి వినతులను, సమస్యలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూర్ శ్రీరామ్, స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఇంచార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, పిట్టల గోవిందు ముఖ్య అతిథులుగా పాల్గొని, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారి నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వారధి కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి త్వరితగతిన పరిష్కారానికి తమ వంతుగా శాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తూములూరి కృష్ణ చైతన్య, ప్రవీన్ రాంకా, పార్టీ వివిధ విభాగాల ప్రతినిధులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.