కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 07: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాన్ని హుజూరాబాద్ డివిజన్ రెవెన్యూ అధికారి (ఆర్‌డీఓ) జల కుమారి బుధవారం సందర్శించారు. తొలిసారిగా కార్యాలయానికి విచ్చేసిన ఆర్‌డీఓ కి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) , కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి , పూలగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, రెవెన్యూ , మున్సిపల్ శాఖల సమన్వయంతో చేపడుతున్న పరిపాలనా అంశాలపై ఆర్‌డీఓ తో చైర్మన్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్‌డీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఓ సుధాకర్, కౌన్సిలర్లు, ఆర్‌ఐతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

